
- టీజీఎన్ పీడీసీఎల్ పరిధిలోని 33/11 కేవీ సబ్స్టేషన్లలో అమలు
- ముందుగా ఫీడర్ లైన్లలో ఫాల్ట్ ప్యాకేజీ ఇండికేటర్లు ఏర్పాటు
- ఆపరేటర్ల జోక్యం లేకుండానే కంట్రోల్ రూమ్ నుంచే ఆపరేట్
- ఇయ్యాల ఖమ్మం జిల్లాలో ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం
ఖమ్మం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. విద్యుత్‌సబ్‌స్టేషన్ల ఆటోమేషన్వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ నార్తర్న్పవర్డిస్ట్రిబ్యూషన్కంపెనీ(టీజీఎన్ పీడీసీఎల్) పరిధిలోని 33/11 కేవీ సబ్స్టేషన్లలో రియల్టైమ్ఫీడర్మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అమలు చేయనుంది. ఇకముందు ఆపరేటర్లు లేకుండానే సబ్స్టేషన్లను ఎక్కడి నుంచైనా నియంత్రించే చాన్స్ ఉంటుంది. విద్యుత్ సరఫరా, అంతరాయాలు, టెక్నాలజీ వంటి అంశాలపై హెడ్‌క్వార్టర్ లోని కంట్రోల్ రూమ్నుంచే ఆపరేట్ చేయొచ్చు. అంతేకాకుండా సంబంధిత అధికారుల సెల్ ఫోన్లకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంది. తద్వారా విద్యుత్ సరఫరాలో ఎవైనా అంతరాయాలు తలెత్తితే తెలుసుకొని, వెంటనే రిపేర్ చేసి సరఫరాను పునరుద్ధరించే వీలు కలుగుతుంది.
సబ్ స్టేషన్ల లైన్లలో ఎఫ్ పీఐల ఏర్పాటు
కొత్త టెక్నాలజీ అమలులో భాగంగా11/33 కేవీ సబ్ స్టేషన్ల లైన్లలో ఫాల్ట్ ప్యాకేజీ ఇండికేటర్లు(ఎఫ్‌పీఐ)ను ఏర్పాటు చేస్తారు. బ్రేక్ డౌన్, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక సమస్యల కారణంగా విద్యుత్‌సరఫరాకు అంతరాయం కలిగితే, లైన్మొత్తం తనిఖీ చేసే అవసరం లేకుండా ఎఫ్‌పీఐలు పనిచేస్తాయి. వీటిని ఖమ్మం జిల్లాలో 18 విద్యుత్ ఫీడర్లలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకు 79 ప్రాంతాలను గుర్తించారు. మధిర నుంచి ఎర్రుపాలెం వెళ్లే 40 కి.మీ పొడవైన 33 కేవీ లైన్లో 5 ప్రదేశాల్లో 33/11 కేవీ జానకీపురం సబ్స్టేషన్నుంచి గొల్లపూడి ఫీడర్లో 5 ప్రదేశాల్లో ఎఫ్‌పీఐలను ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే ఆ ప్రాంతాన్ని గుర్తించి నేరుగా వెళ్లి విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేస్తారు. దీంతో విద్యుత్ శాఖ సిబ్బందిపై కూడా భారం తగ్గుతుంది.
ఇయ్యాల ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం
ఇలాంటి విధానాన్ని ఇప్పటికే బెంగళూరు, ఒడిశా, ఢిల్లీ, ముంబై అమలు చేస్తున్నాయి. ఎన్ పీడీసీ ఎల్ పరిధిలో 1, 516 సబ్ స్టేషన్లు ఉండగా, ముందుగా 100 సబ్స్టేషన్లలో ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకు రూ.26.32 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో 38 సబ్స్టేషన్లలో ఆధునీకికరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. మొదట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెగ్మెంట్ మధిరలోని జానకీపురంలో సబ్‌స్టేషన్ ఆటోమేషన్ పనులు చేపట్టారు.
ఇయ్యాల(బుధవారం) సబ్స్టేషన్రియల్ టైమ్ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉప ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఫీడర్పై ఫాల్ట్ ప్యాసేజీ ఇండికేటర్ల ఏర్పాటు పనులను మంగళవారం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, ఇతర అధికారులు పరిశీలించా రు. ఎఫ్‌పీఐల ఏర్పాటు తో విద్యుత్ సరఫరాలో అంతరాయ సమయం తగ్గడంతో పాటు కస్టమర్లకు నాణ్యమైన కరెంట్ ను అందించవచ్చని ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు.