V6 News

ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు

ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు

హైదరాబాద్, వెలుగు : పలువురు ఐఎఫ్‌‌ఎస్‌‌ అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. యాదాద్రి డీఎఫ్‌‌వో ఐ.పద్మజారాణిని సిద్ధిపేట జిల్లా డీఎఫ్‌‌వోగా ట్రాన్స్​ఫర్​ చేశారు. నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా డీఎఫ్‌‌వో రోహిత్‌‌ గొప్పిడిని రంగారెడ్డి జిల్లా డీఎఫ్‌‌వోగా, అక్కడ డిప్యూటీ ‍ కన్జర్వేటర్‌‌ ఆఫ్‌‌ ఫారెస్ట్​గా పనిచేస్తున్న డి.సుధాకరరెడ్డిని  యాదాద్రి డీఎఫ్‌‌వోగా బదిలీ చేశారు. 

ఉట్నూరు ఎఫ్‌‌డీవోగా ఉన్న రేవంత్‌‌చంద్రను నాగర్‌‌కర్నూల్‌‌ డీఎఫ్‌‌వోగా, కాగజ్‌‌నగర్‌‌ ఎఫ్‌‌డీవో సుషాంత్‌‌ సుఖదేవ్‌‌ బొబాడేను నిర్మల్‌‌ డీఎఫ్‌‌వోగా, నారాయణ్‌‌పేట డీఎఫ్‌‌వో కేఏవీఎస్‌‌ ప్రసాదరెడ్డిని సంగారెడ్డి డీఎఫ్‌‌వోగా, అక్కడి ఏసీఎఫ్‌‌ సి.శ్రీధర్‌‌రావును ములుగులోని ఎఫ్‌‌సీఆర్‌‌ఐ జాయింట్‌‌డైరెక్టర్‌‌గా బదిలీ చేశారు.