ఇవాళ ప్రధానిని కలవనున్నగవర్నర్ రాధాకృష్ణన్

ఇవాళ ప్రధానిని కలవనున్నగవర్నర్ రాధాకృష్ణన్

న్యూఢిల్లీ, వెలుగు :  ఇటీవల తెలంగాణ గవర్నర్‌‌‌‌‌‌‌‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్ తొలిసారిగా ఢిల్లీ వచ్చారు. సోమవారం పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్లిన గవర్నర్.. సాయంత్రం అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ హోదాలో తొలిసారిగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో ఆయన బస చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ఇతరులను మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.