అప్పుల కుప్పగా తెలంగాణ

అప్పుల కుప్పగా తెలంగాణ
  • అప్పుల కుప్పగా తెలంగాణ
  • అన్ని శాఖల పరిస్థితీ అంతే
  • దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిన పెడ్తం
  • తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది
  • ప్రజలకు, పాలకులకు మధ్య ఇనుప కంచెల్లేవ్
  • దుబారా ఖర్చలు చేయం, ఆడంబరాలకు పోం
  • ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తం
  • శాసన సభలో గవర్నర్ తమిళిసై ప్రసంగం

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని, అప్పుల ఊబిలో ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. మహాకవి కాళోజీ వాక్యాలతో తెలుగులో  ప్రసంగాన్ని  ప్రారంభించిన తమిళిసై ఆంగ్లంలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. దివాలా తీసిన రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామని, దుబారా ఖర్చులు చేయబోమని, ఆడంబరాల కు వెళ్లబోమని అన్నారు.

 నిర్బంధపు పాలన అంతమై ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారని గవర్నర్ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని చెప్పారు.  గత ప్రభుత్వం కార్పొరేషన్ల పేరిట విచ్చల విడిగా అప్పులు తీసుకుందని చెప్పారు. వ్యక్తి కోసం వ్యవస్థలు, సంస్థలు పనిచేశాయన్నారు. డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. హైదరాబాద్ మహానగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చుతామని అన్నారు. ఉద్యోగలా భర్తీకి పెద్దపీట వేస్తామని,  టీఎస్పీఎస్సీ ద్వారా రెండు లక్షల కొలువులను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. మెగా డీఎస్సీ ప్రకటించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.

ఇదీ పరిస్థితి

అప్పుల ఊబిలోనే అన్ని శాఖలు 
రూ.81,516 కోట్ల అప్పుల్లో డిస్కంలు
రూ.50,275 కోట్ల నష్టాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు రూ.56 వేల కోట్లు
ఆ కార్పొరేషన్ నష్టాలు 11 వేల కోట్ల  
కార్పొరేషన్ల పేరిట విచ్చల విడిగా రుణాలు
ఆర్థిక క్రమశిక్షణ లేదు.. వ్యవస్థ గాడి తప్పింది
వ్యక్తుల కోసం వ్యవస్థలు, సంస్థలు పనిచేశాయి
విచ్చల విడిగా దుబారా ఖర్చులు చేశారు

ఇవి చేస్తం

ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం 
దివాలా తీసిన రాష్ట్రాన్ని మెరుగు పరుస్తం
టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువులు 
త్వరలో మెగా డీఎస్సీని కూడా ప్రకటిస్తం
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తం
ఇకపై డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ 
భూమాత ద్వారా భూ సమస్యల పరిష్కారం