రూ.3 వేల కోట్ల టార్గెట్..మరోసారి వేలానికి భూములు

రూ.3 వేల కోట్ల టార్గెట్..మరోసారి వేలానికి భూములు

భాగ్యనగరంలో మరోసారి భూములను వేలానికి పెట్టింది రాష్ట్ర సర్కార్. కోకాపేటలోని 45 ఎకరాలను అమ్మకానికి ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన HMDA. నియోపోలిస్ ఫేస్-2 లో ప్లాట్ల వేలం వేయనుంది HMDA. మొత్తం 45.33 ఎకరాల్లో..... 3.60 ఎకరాల బిట్టు నుండి 9.71 ఎకరాల ప్లాట్ల వరకు ఉన్నాయి. ఈ నెల 20 న ప్రీ బీడ్ సమావేశం నిర్వహించనుంది. 

ఈ నెల 31 వరకు రిజిస్ట్రేషన్ కు గడువు ఇచ్చింది. ఆగస్టు ఫస్ట్ నుంచి ఈఎండీ చెల్లింపుకు గడువుంది. వచ్చే నెల 3 న రెండు సెషన్ లుగా భూములు వేలం వేయనుంది HMDA. సర్కార్ ఎకరాకు 35 కోట్లుగా ధర నిర్ధారించింది. గతంలో కోకాపేటలో ఎకరానికి 60 కోట్లు కోడ్ చేసి కొనుగోలు చేశారు రియల్ వ్యాపారులు. ఈ సారి కూడా ఎకరా 60 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు HMDA అధికారులు. ఈ 45.33 ఎకరాల భూమి అమ్మకంతో భారీగా ఆదాయం రానుంది.