25వేలు దోచుకుని.. 5వేల రైతుబంధుతో గొప్పలు చెప్పుకుంటున్నారు

 25వేలు దోచుకుని.. 5వేల రైతుబంధుతో గొప్పలు చెప్పుకుంటున్నారు
  • 15 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేయకుండా మానేశారు
  • వరి వేయని రైతులందరికీ 25వేలు నష్టపరిహారం ఇవ్వాలి

కొత్తగూడెం: టీఆర్ఎస్ పార్టీని ఏమైనా అంటే వరికంకులతో కొట్టమంటున్నారు మరి... తప్పులు చేస్తున్న సీఎం కేసీఆర్ ను దేనితో కొట్టాలని వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. టీఆర్ఎస్ ను ఏమైనా అంటే వరి కంకులతో కొట్టమన్న ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి  వ్యాఖ్యలను ప్రస్తావించి మండిపడ్డారు వైఎస్ షర్మిల. కొత్తగూడెం  నియోజకవర్గం సుజాత  నగర్  గ్రామంలో  నిర్వహించిన  రైతు గోస  ధర్నాలో  షర్మిల పాల్గొన్నారు.  స్థానిక ఎమ్మెల్యే  చేసిన  అరాచకానికి  ఓ కుటుంబం  సూసైడ్ చేసుకుందన్నారు.  ఇప్పటి వరకు ఎమ్మెల్యే పై  చర్యలు  తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సీఎంగా రెండు సార్లు అధికారంలో ఉన్నా వ్యవసాయ రంగం నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు ఎలా బతుకుతున్నారు అనేది చూడకుండా.. రైతులు కోటీశ్వరులయ్యారు.. కార్లలో తిరుగుతున్నారు... బంగారు ఆవాసాలయ్యాయని కేసీఆర్ పొగుడుకుంటున్నారని షర్మిల అన్నారు. వాస్తవంలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. 8 సంవత్సరాలలో వేల మంది ఆత్మహత్య చేసుకున్నారంటే.. కోటీశ్వరులై.. కార్లు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకున్నారా..? అని షర్మిల ప్రశ్నించారు. బ్యాంకుల వాళ్లు ఇళ్లకు వచ్చి తాళాలు వేసి అప్పుల కోసం వేధిస్తుంటే.. అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన కేసీఆర్ .. ఏ పంట వేసుకున్నా లాభాలు వచ్చే పరిస్థితి లేదంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. 
25వేలు రైతు దగ్గర దోచుకుని.. 5వేలు రైతు బంధు ఇస్తున్నారని.. ఉచిత విత్తనాలు, ఎరువులు, పంట నష్టపోతే.. పరిహారం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పథకాలన్నీ బందుపెట్టి.. కేవలం 5వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి గొప్పలు చేసుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. అసలు కౌలు రైతులను రైతుల్లా చూస్తున్నారా..? భూమి లేని పేద రైతులు కౌలు రైతులు.. ఉన్న భూములు అమ్ముకుని కౌలుకు చేసుకుంటున్న నిరుపేద భూములు లేని కౌలు రైతులను ఆదుకునే ఆలోచనే చేయడం లేదు. కౌలు రైతులకు రుణాలు లేవు.. రైతు బంధు లేదు.. ఏ ఒక్క సహాయం అందడం లేదని షర్మిల అన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఏడేళ్ల బీజేపీ పాలనలో ధరలు పెరిగాయి

పువ్వాడపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికే నష్టం

ఈ ఊళ్లో ఉప్పు గని ఉంది