ఏడేళ్ల బీజేపీ పాలనలో ధరలు పెరిగాయి

ఏడేళ్ల బీజేపీ పాలనలో ధరలు పెరిగాయి

మెదక్: ఏడేళ్ల  బీజేపీ పాలనలో  ధరలు పెరిగాయని  మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ పాలనలో 450 నుండి 1050 రూపాయలకు పెరిగిందని ఆయన అన్నారు. మెదక్ జిల్లా   హసన్ మహ్మద్ పల్లిలో  56మంది లబ్దిదారులకు దళిత బంధు యూనిట్స్  పంపిణీ చేశారు మంత్రి  హరీష్ రావు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ  రాబోయే  ఆర్థిక సంవత్సరంలో  2 లక్షల మందికి దళిత బంధు ఇస్తామన్నారు. దీని కోసం బడ్జెట్లో 17 వేల కోట్లు కేటాయించామన్నారు. మన పక్కన కర్ణాటకలో పాలిస్తున్న బీజేపీ అక్కడ వృద్దాప్య ఫించన్లు 600 ఇస్తుంటే, మన తెలంగాణలో 2016 ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు వివరించారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటుబ్యాంక్ గానే ఉపయోగించుకుందని ఆయన విమర్శించారు. 

 

ఇవి కూడా చదవండి

పువ్వాడపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికే నష్టం

ఈ ఊళ్లో ఉప్పు గని ఉంది