గుడ్ న్యూస్ : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు..అప్లికేషన్లకు గ్రీన్ సిగ్నల్

గుడ్ న్యూస్ : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు..అప్లికేషన్లకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఎలాంటి ఆరోపణలు లేని కంపెనీలు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటన చేసింది. దరఖాస్తు చేసుకునే కంపెనీలపై ఎలాంటి ఆరోపణలు లేవనే హామీ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్లో పెట్టి.. ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించనున్నారు.. వచ్చిన ఫిర్యాదుల ప్రకారం.. కొత్త బ్రాండ్ కంపెనీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు బేవరేజెస్. 

తెలంగాణ ఎక్సైజ్​శాఖ, తెలంగాణ బేవరేజేస్ కార్పొరేషన్ 2024లో  కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతించినా, విమర్శలు రావడంతో వెంటనే వెనక్కి తీసుకుంది. కానీ ఇప్పుడు కంపెనీలకు ప్రత్యేక విధానంలో పర్మిషన్లు ఇస్తోంది. గతంలో అనుమతులు ఇచ్చిన కంపెనీల్లో టాయిట్‌‌ బ్రూవరీస్‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌, ఎక్సోటికా లిక్కర్‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌, మౌంట్‌‌ ఎవరెస్ట్ లిమిటెడ్‌‌, లీలాసన్స్‌‌ ఆల్కా బేవ్‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌, సోం డిస్టిలరీస్‌‌ అండ్‌‌ బేవరేజెస్‌‌ ఉన్నాయి.  ఇందులో సోమ్ డిస్టిలరీస్‌‌ నుంచి పవర్1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పికర్ బీర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం యునైటెడ్ బ్రూవరీస్​నుంచే దాదాపు 70 శాతం బీర్లు రాష్ట్రవ్యాప్తంగా సప్లై అవుతున్నాయి. 

 బీర్ల ధరలు పెంపు

ఫిబ్రవరి 10న తెలంగాణ ప్రభుత్వం  బీర్ల ధరలను 15 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఒక్క బీర్ల కేస్  మీద 15 శాతం బేసిక్‌‌  ధర పెంచితే, దానికి కనీసం రూ. 250 నుంచి రూ. 280 వరకు వ్యాట్‌‌, ఎక్సైజ్‌‌ సుంకంతో పాటు వివిధ రకాల పన్నులు జత కలుస్తాయి. దీంతో రూ.150 ఉన్న లైట్‌‌ బీరు రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్‌‌ బీరు ధర రూ.200 వరకు పెరిగింది. అంటే తెలంగాణలో ఒక్కో లైట్ బీర్పై 30 రూపాయలు, స్ట్రాంగ్ బీరుపై 40 రూపాయలు ధర పెరిగింది