అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. కొత్త ఐడియాతో  ప్రభుత్వం

అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. కొత్త ఐడియాతో  ప్రభుత్వం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు తీసుకు వస్తోంది. ఆ సాంకేతికతను  ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. ఎక్కడ ఉపయోగించబోతోందో తెలుసా.. ఫారెస్ట్ లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పని చేసే కెమెరాలను అడవుల్లో కీలకమైన ప్రాంతాల్లో పెడతారు. ఇవి వివిధ జంతువులు, పక్షులు, వృక్షాల ఫొటోలను తీస్తాయి. దీంతో అడవుల్లో నివసించే వివిధ రకాల జీవ జాతులపై అధ్యయనం చేయడం సులభతరం అవుతుంది. అలాగే జంతువులను వేటాడే  వారిని సులభంగా పట్టుకోవచ్చ ని అధికారుల ప్లాన్.

అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వ్ లో...

ఏఐ ఆధారిత అటవీ జీవ వైవిధ్య పరిరక్షణ వేదికను ప్రస్తుతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవాల్ టైగర్ రిజర్వ్ లలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇక్కడ ఏఐ నాలుగు మిలియన్ చిత్రాలను ప్రాసెస్  చేసింది.  తద్వారా అటవీ అధికారులు అడవుల్లోకి వెళ్లకుండానే అన్ని రకాల జీవుల సమాచారాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.