గుడ్ న్యూస్: మరో 681 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్

గుడ్ న్యూస్:  మరో 681 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్

 కొత్తగా 681 మంది డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్ మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు మంత్రి సీతక్క ఫైల్ పై సంతకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో  4011 మంది డయాలసిస్ పేషెంట్లకు సామాజిక పెన్షన్లు అందేవి.   ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4029 మంచి డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్ల మంజూరు  చేస్తోంది.  తాజాగా మరో 681 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేసింది ప్రభుత్వం. 

పలు  ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 681 మంది డయాలసిస్ పేషంట్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా గుర్తించింది ప్రభుత్వం.  ఈ 681 మంది డయాలసిస్ పేషెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత పెన్షన్లను మంజూరు చేసింది సెర్ప్. 

 681 మంది డయాలసిస్ పేషెంట్లలో, అత్యధికంగా హైదరాబాద్ లో 629 మంది చికిత్స పొందుతున్నారు.  మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి 52 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు .  పూర్తిస్థాయిలో పనిచేసుకోలేకపోవడంతో వారి ఆరోగ్య, ఆర్థిక పరిస్థితుల కారణంగా  పెన్షన్ మంజూరు చేసింది ప్రభుత్వం.  ఆగస్ట్   నుంచి డయాలసిస్ పేషెంట్లు  పెన్షన్ అందుకోనున్నారు కొత్త పింఛన్ దారులు. ఒక్కొక్కరు నెలకు రూ. 2016 పెన్షన్ అందనుంది.