ఉద్యోగ నియామ‌క ప‌రీక్షల్లో వ‌యోప‌రిమితి 46కు పెంపు : సీఎస్​ శాంతికుమారి

ఉద్యోగ నియామ‌క ప‌రీక్షల్లో వ‌యోప‌రిమితి 46కు పెంపు :   సీఎస్​ శాంతికుమారి

హైదరాబాద్, వెలుగు : ఉద్యోగ నియామ‌క ప‌రీక్షలకు ప్రభుత్వం వ‌యోప‌రిమితిని పెంచింది. ఈ మేరకు సీఎస్ ​శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితిని 44 ఏండ్ల నుంచి 46 ఏండ్లకు ప్రభుత్వం పొడిగించింది. అయితే యూనిఫామ్ స‌ర్వీస్ ఉద్యోగాల‌కు మాత్రం ఈ వ‌యోప‌రిమితి పొడిగింపు లేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత 2015లో వయోపరిమితిని 34 నుంచి 44 ఏండ్లకు పెంచారు. నిరుద్యోగ యువత, టీఎస్‌పీఎస్సీ వినతి మేరకు వయోపరిమితిని మరో రెండేం డ్లు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది నిరుద్యోగుల‌కు ప్రయోజనం చేకూరనుంది.