- రూ.17 కోట్లు విడుదల చేస్తూ సర్కారు ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: టాడీ టాపర్స్ కో ఆపరే టివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రెండో త్రైమాసికంలో భాగంగా రూ.17 కోట్లు రిలీజ్ చేస్తూ ప్రభు త్వం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. ఈ మేర కు శనివారం బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గౌడ కులస్తులు ప్రమాదాల బారిన పడకుండా టాడీ టాపర్స్ కార్పొరేషన్ కాటమయ్య కిట్స్‌ను పంపిణీ చేస్తున్నది.
ఈ స్కీమ్‌కు గతేడాది బడ్జెట్‌లో మొత్తం రూ. 68 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు రూ.34 కోట్లు రిలీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 వేల కాటమయ్య కిట్లు రిలీజ్ చేయగా మరో 20 వేల కిట్ల పంపిణీ చేసేందుకు గౌడ సోదరులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సమ్మర్‌లో వీటి పంపిణీ పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు.
