టెన్త్ స్టూడెంట్లకు లాంగ్వేజీ స్టడీ మెటీరియల్

టెన్త్ స్టూడెంట్లకు లాంగ్వేజీ స్టడీ మెటీరియల్
  • డిసెంబర్ మొదటి వారంలోపు అందజేయనున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషా సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటిరియల్స్ అందించనున్నారు. ఈ మేరకు సంబంధిత మెటీరియల్స్ ను ఎస్‌‌‌‌సీఈఆర్టీ అధికారులు ఇప్పటికే రెడీ చేశారు. 

స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇటీవలే ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చారు. రాష్ట్రంలోని లోకల్ బాడీ, గవర్నమెంట్, కేజీబీవీ, మోడల్ స్కూల్, సొసైటీ గురుకులాల్లో సుమారు 2.5 లక్షల మంది టెన్త్ స్టూడెంట్లు ఉన్నారు. వారికి ఇప్పటిదాకా ప్రధాన సబ్జెక్టులకు మాత్రమే స్టడీ మెటిరియల్ ఇచ్చేవారు. 

తాజాగా తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటిరియల్స్ కూడా అందించాలని నిర్ణయించారు. వీటిని వెంటనే ప్రింట్ చేయించి, ఈ నెలాఖరులోగా జిల్లాలకు పంపించాలని, డిసెంబర్ మొదటి వారంలోపు పిల్లలకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు.