ఆదాయ లీకేజీలపై..స్పెషల్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్!ఫుల్ పవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రత్యేక విభాగం

ఆదాయ లీకేజీలపై..స్పెషల్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్!ఫుల్ పవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రత్యేక విభాగం
  •    హైడ్రా, టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ తరహాలో ఫుల్ పవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రత్యేక విభాగం
  •     జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్, సివిల్ సప్లైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగాలపై నిఘా
  •     ఆయా శాఖల నుంచి సిబ్బంది నియామకం.. అవసరమైతే కొత్త చట్టం
  •     ప్రభుత్వ రాబడికి గండికొట్టే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి
  •     ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ వనరుల ద్వారా వచ్చే ఆదాయ లీకేజీలను, అక్రమాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా హైడ్రా, పోలీస్ శాఖలోని టాస్క్‌‌‌‌ఫోర్స్ తరహాలో ‘ప్రత్యేక ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ వింగ్’ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం పన్నుల వసూళ్లు, ఆదాయ వృద్ధి, అక్రమాల నివారణపై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రాబడికి గండి కొట్టే ఏ ఒక్క విధానాన్ని లేదా శక్తులను ఉపేక్షించేది లేదని, నిబంధనలను మరింత కఠినతరం చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ వింగ్‌‌‌‌కు విస్తృతమైన అధికారాలు కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న వివిధ చట్టాల పరిధిలోనే ఈ ప్రత్యేక వింగ్‌‌‌‌ను వెంటనే ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన న్యాయపరమైన అంశాలపై న్యాయ నిపుణులను సంప్రదించి, భవిష్యత్తులో అవసరమైతే అసెంబ్లీలో కొత్త చట్టాన్ని కూడా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. నెలకు రూ.వెయ్యి కోట్ల లీకేజీ అరికట్టినా ఏడాదికి 12 వేల కోట్లు ఖజానాకు చేరుతాయని ఎన్నో పథకాలు అమలు చేసేందుకు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. 

ఆదాయ మార్గాల్లో అక్రమాలపై ఉక్కుపాదం  

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయాన్ని సమకూర్చే కీలక రంగాలపై ఈ ప్రత్యేక ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ వింగ్ నిరంతర నిఘా ఉంచనుంది. ముఖ్యంగా వాణిజ్య పన్నులు (జీఎస్టీ), ఎక్సైజ్ శాఖ, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగం, ట్రాన్స్‌‌‌‌పోర్ట్, సివిల్ సప్లయ్స్ విభాగంతో పాటు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రాబడిని తెచ్చిపెట్టే ఇతర అన్ని అనుబంధ ప్రభుత్వ విభాగాలలో జరిగే అవినీతి, అక్రమాలు, పన్ను ఎగవేతలను సమూలంగా అరికట్టడమే ఈ ప్రత్యేక వింగ్ యొక్క ప్రధాన లక్ష్యం కానుంది. ఇప్పటివరకు సాధారణ తనిఖీలతో సరిపెట్టుకుంటున్న విధానాలకు స్వస్తి పలికి, క్షేత్రస్థాయిలో పక్కా సమాచారంతో దాడులు నిర్వహించేలా ఈ వింగ్‌‌‌‌ను రూపొందిస్తున్నారు. ఆదాయ లీకేజీలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనపు వనరులు సమకూరుతాయని, తద్వారా సంక్షేమ పథకాలకు మరింత ఊతం లభిస్తుందని సీఎం భావిస్తున్నారు. ఈ వ్యవస్థ కేవలం పర్యవేక్షణకే పరిమితం కాకుండా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా దీనికి ప్రత్యేక స్వేచ్ఛను, అధికారాలను కల్పిస్తూ సమగ్ర మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

రూల్స్ కఠినతరం.. అవసరమైతే కొత్త చట్టం 

సమీక్షా సమావేశంలో చట్టపరమైన సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతానికి వివిధ చట్టాలలో ఉన్న నిబంధనలను, వెసులుబాట్లను ఆధారంగా చేసుకుని ఈ ప్రత్యేక వింగ్‌‌‌‌ను ప్రాథమికంగా ఏర్పాటు చేయాలని, అయితే భవిష్యత్తులో ఈ వ్యవస్థకు మరింత చట్టబద్ధమైన పటిష్టత కల్పించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించేలా రూల్స్ బుక్‌‌‌‌ను పూర్తిగా మార్చాలని, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారికి గట్టిగా బుద్ధి చెప్పేలా చట్టాలను కఠినతరం చేయాలన్నారు. చట్టపరమైన లోపాలను వాడుకుని ఆదాయానికి గండికొట్టే ముఠాల ఆటకట్టించేందుకు, అవసరమైన అన్ని అంశాలపై దేశంలోని అత్యుత్తమ న్యాయ నిపుణుల సలహాలను, సూచనలను సేకరించాలని అధికారులకు సూచించారు. న్యాయ నిపుణుల నివేదిక ఆధారంగా, భవిష్యత్తులో ఈ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ వింగ్ పరిధిని మరింత విస్తృతం చేస్తూ అసెంబ్లీ వేదికగా ఒక నూతన చట్టాన్ని   కూడా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోందని, నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం పేర్కొన్నారు.

హైడ్రా, టాస్క్‌‌‌‌ఫోర్స్ నమూనా

ఈ నూతన ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా, వేగంగా పనిచేసేందుకు వీలుగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సమర్థులైన అధికారులను, సిబ్బందిని తక్షణమే డిప్యుటేషన్‌‌‌‌పై నియమించుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు ‘టాస్క్‌‌‌‌ఫోర్స్’ ఏ విధంగానైతే మెరుపువేగంతో స్పందిస్తుందో, అలాగే నగర పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ‘హైడ్రా’ ఏ తరహాలో దూకుడుగా వ్యవహరిస్తుందో, అదే స్ఫూర్తితో ఈ ఆర్థిక ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ వింగ్ కూడా క్షేత్రస్థాయిలో దూసుకుపోవాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ఆయా శాఖల్లో ఎక్కడెక్కడ లీకేజీలు జరుగుతున్నాయో గుర్తించి, వాటిని సాంకేతికత సహాయంతో అడ్డుకునేందుకు అవసరమైన మానవ వనరులను వెంటనే సమకూర్చుకోవాలని చెప్పారు. సిబ్బంది కొరత నెపంతో పనుల్లో ఆలస్యం జరగడానికి వీల్లేదని, నియామకాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి వింగ్‌‌‌‌ను వీలైనంత త్వరగా గ్రౌండ్ లెవెల్‌‌‌‌లో యాక్టివ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.