
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రూప్– 2 అభ్యర్థులకు నాలుగో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 23,24 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఉదయం 10.30 గంటల నుం చి సాయంత్రం 5గంటల వరకూ కొనసాగుతుందని తెలిపింది.
ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ ప్రియాంక అల ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోతే వారికోసం ఈ నెల 25న రిజర్వ్డ్ డే ఉంటుందని తెలిపారు. అయితే, 23న వంద మంది, 24న 93 మందిని వెరిఫికేషన్ కోసం పిలిచారు. ఆయా అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను టీజీపీఎస్‌సీ వెబ్‌సైట్ https://www.tgpsc.gov.inలో అందుబాటులో ఉంచారు.