
హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో 5వ తరగతి ఎంట్రన్స్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ తుది దశ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ఫేజ్ లో రెండు దశలుగా రిజల్ట్స్ రిలీజ్ చేయగా, వివిధ కేటగిరీలకు చెందిన ఫైనల్ రిజల్ట్స్ ను ఎంట్రన్స్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఆదివారం విడుదల చేశారు.
ఈ ఫేజ్ లో మొత్తం 13,130 మందికి సీట్లను కేటాయించినట్టు పత్రిక ప్రకటనలో తెలిపారు. సీట్లు వచ్చిన వాళ్లు ఈ నెల 20 లోగా స్కూళ్లలో రిపోర్ట్ చేయాలని సెక్రటరీ సూచించారు. అర్హులైన విద్యార్థులు వివరాల కోసం www.tgswreis.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని అలుగు వర్షిణి కోరారు.