గుడ్ న్యూస్ : 18వ తేదీన లక్ష రూపాయల రైతుల అప్పు మాఫీ

గుడ్ న్యూస్ : 18వ తేదీన లక్ష రూపాయల రైతుల అప్పు మాఫీ

తెలంగాణ రైతులకు పండగే పండగ.. శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఆగస్ట్ 15వ తేదీలోపు 2 లక్షల రూపాయల రైతుల అప్పులు మాఫీ చేస్తామన్న హామీకి కట్టుబడి.. 2024, జూలై 18వ తేదీన లక్ష రూపాయల వరకు అప్పులను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 18వ తేదీ సాయంత్రంలోపు రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.

రుణ మాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను.. ఇతర ఖాతాల్లో జమ చేయకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం. రైతుల రుణ మాఫీ డబ్బులు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపైనే ఉందని ఆదేశాలు జారీ  చేసింది సర్కార్. 

ALSO READ | రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ

18వ తేదీ సాయంత్రంలోగా లక్ష రూపాయల రుణ మాఫీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో రుణమాఫీ సంబరాలు ఉంటాయని.. ఆ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారని కూడా వెల్లడించింది కాంగ్రెస్ ప్రభుత్వం.