ఇవాళ్టి నుంచి 3 రోజులు జోరు వానలు

ఇవాళ్టి నుంచి 3 రోజులు జోరు వానలు

హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 5వ తేదీ మోస్తరు నుంచి భారీ వర్షాలు, 6, 7, 8 తేదీల్లో కొన్ని జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. శని, ఆది, సోమవారాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని ప్రకటించింది. శనివారం రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, అలాగే ఆరెంజ్ అలర్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. గురవారం కరీంనగర్ జిల్లా గంగాధరలో 15.5 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో 11.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది.