
హైదరాబాద్, వెలుగు: రేషన్ కార్డులు 87.59 లక్షల మందికి ఉంటే ఇప్పటి వరకూ 50 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇచ్చినట్లు సీఎస్ తన నివేదిక లో పేర్కొనడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మిగిలిన 38 లక్షల మంది మాటేమిటని ప్రశ్నించింది. రేషన్ పై ఇటీవల దాఖలైన పిటిషన్ ను హైకోర్టు బుధవారం విచారించిం ది. ప్రభుత్వం తరఫున చీఫ్‌సెక్రటరీ ఇచ్చిన కౌంటర్ కు హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ ఉంటే వారంతా ఎలా జీవనాన్ని సాగించాలని చీఫ్ జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్ , జస్టి స్ అమర్ నాథ్ గౌడ్ బెంచ్ ప్రశ్నించింది. రూ. 5కే అన్నం పెడుతున్నా మని చెప్పడాన్ని కూడా తప్పుపట్టింది. లాక్‌డౌన్ ఉంటే పనిలేని వాళ్లు ఐదు రూపాయలు ఎలా తెస్తారని ప్రశ్నించింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో అన్నంపె డుతున్నారని, మిగిలిన రాష్ట్రం లోని వారి పరిస్థితి ఏం కావాలని నిలదీసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. షెల్టర్ హోమ్స్ వసతులపై వివరణ ఇవ్వండి కరోనా కారణంగా ట్విన్ సిటీస్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్స్ ఎన్ని ఉన్నా యో, వాటిలో వసతులు ఏమున్నాయో తెలియజేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిం చింది. లాయర్ వసుధా నాగరాజ్ రాసిన లేఖను బుధవారం పిల్‌గా స్వీకరించి పైవిధంగా ఆదేశించింది. ఇటీవలే పుట్టిన పిల్లలు, బాలింతలు షెల్ట ర్ హోమ్స్‌లో ఉన్నా రని, నేలపై నిద్రించలేక కుర్చీల్లోనే బాలింతులు రోజంతా కూర్చుంటున్నారని, ఆపరేషన్లు చేయించుకున్న రోగుల పరిస్థితి కూడా అదేవి ధంగా ఉందనే పిల్‌లోని అంశాలపై కూడా వివరణ ఇవ్వాలని హైకోర్టు తేల్చిచెప్పింది.