
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో విచారణ ముగిసింది. ఇంటర్ ఫలితాల వల్ల విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరమన్న ధర్మాసనం.. వారికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని చెప్పింది. అంతేకాకుండా ఆత్మహత్యలకు, ఇంత గందరగోళానికి కారణమైన భాధ్యులపై చర్యల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై .. శాఖాపరమైన విచారణ చేసి ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాలని కోర్టు తెలిపింది. ఫలితాల్లో తప్పులు జరిగాయని అభిప్రాయపడిన కోర్టు.. రీ-వెరిఫికేషన్‌లో 0.16% మాత్రమే ఉత్తీర్ణులయ్యారని తెలిపింది.