గద్వాల జిల్లా కోర్టు భవన నిర్మాణంపై.. హైకోర్టు తీర్పు రిజర్వ్‌‌

గద్వాల జిల్లా కోర్టు భవన నిర్మాణంపై.. హైకోర్టు తీర్పు రిజర్వ్‌‌
  • పూడూరులో సమీకృత కోర్టు సముదాయం ఏర్పాటు చేయాలని పిల్ దాఖలు

హైదరాబాద్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా పూడూరులో సమీకృత జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణాన్ని ప్రారంభించి, నిర్దిష్ట సమయంలో పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తీర్పును రిజర్వ్‌‌‌‌ చేసింది. హైకోర్టు యాక్టింగ్‌‌‌‌ చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ పి. శ్యాంకోశి, జస్టిస్‌‌‌‌ సుద్దాల చలపతిరావుతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌‌‌‌పై విచారణ జరిపింది.

న్యాయవాది షఫీవుల్లా దాఖలు చేసిన ఈ పిల్ పై పిటిషనర్‌‌‌‌ తరఫున న్యాయవాది శ్రీలేఖ వాదనలు వినిపించారు. కోర్టు భవన సముదాయం కోసం ప్రభుత్వం సర్వే నంబరు 368లో పది ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. కేటాయించిన స్థలంలో కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేసి పనులు త్వరగా ప్రారంభించేలా ఆదేశించాలని కోరారు. కనీసం ప్రత్యేక మరుగుదొడ్లు కూడా లేవన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఇరుపక్షాల వాదనల విచారణ అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్‌‌‌‌ చేసింది