హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు పాఠశాలల్లో సొంత సిలబస్ అమలు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. సీబీఎస్ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌సీఈ ఆర్‌టీ ఆమోదించని పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని చేయాలని ఆదేశించింది.
హైదరాబాద్‌లోని డాన్ బాస్కో స్కూల్‌లో సరఫరా చేస్తున్న పాఠ్యపుస్తకాలు, ప్రణాళికను సవాలు చేస్తూ హైదరాబాద్ బోరబండకు చెందిన బి.జోషువా పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రైవేటు పాఠశాలలో ఎన్‌సీఈఆర్‌టీ ఆమోదంలేని సొంత పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తున్నారన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
