సెక్రటేరియట్‌ను కూల్చొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

సెక్రటేరియట్‌ను కూల్చొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

రాష్ట్ర సెక్రటేరియట్ భవనం కూల్చివేత నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర సెక్రటేరియట్ భవన సముదాయాన్ని కూల్చొద్దని ఆదేశాలు ఇచ్చింది.

లంచ్ మోషన్ లో భాగంగా.. దాఖలైన పిటిషన్ ను విచారణ చేసిన హైకోర్టు మౌలిక ఆదేశాలు జారీచేసింది. ఈనెల 14 వరకు సెక్రటేరియట్ లో ఎటువంటి కూల్చివేతలు చేయొద్దని హైకోర్టు సూచించింది. దసరా తర్వాత మరోసారి కోర్టు ముందుకు పిటిషన్ విచారణకు రానుంది.

సెక్రటేరియట్ కూల్చివేత నిర్ణయంతో రూ.కోట్ల విలువైన ప్రజాధనం వేస్టవుతుందంటూ పిటిషనర్లు హైకోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ నిర్ణయం వెనుక కారణాలను ఇప్పటికే కోర్టుకు విన్నవించినట్టు అడ్వకేట్ జనరల్ చెప్పారు. చాలా పనులు ఇప్పటికే పూర్తయ్యాయనీ… కూల్చివేత ఒక్కటే మిగిలి ఉందని ఆయన జస్టిస్ కు విన్నవించారు. ఐతే… ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి… దసరా పండుగ సెలవులు ఉన్న సందర్భంలో కూల్చివేతలకు అప్పుడే చేయొద్దని.. పనులకు బ్రేక్ వేయాలని కోర్టు అడ్వకేట్ జనరల్ కు సూచించింది. ఇప్పటికే కూల్చివేతలకు కూడా అంతా సిద్ధం చేసుకున్నామని.. దీనిపై స్టే ఇవ్వొద్దని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. తాము స్టే ఇవ్వడం లేదని.. కూల్చివేత పనులను 14వ తేదీ వరకు మొదలుపెట్టొద్దని మాత్రమే చెబుతున్నామని జస్టిస్ తెలిపారు.