V6 News

కూరగాయలు, చిరుధాన్యాల ప్రాసెసింగ్పై ట్రైనింగ్

కూరగాయలు, చిరుధాన్యాల ప్రాసెసింగ్పై ట్రైనింగ్
  •     ఈ నెల 26న నిర్వహణ

అబిడ్స్, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూరగాయలు, చిరుధాన్యాల ప్రాసెసింగ్ పద్ధతులపై ఈనెల 26న ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. నాంపల్లి రెడ్ హిల్స్​లోని ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో నిపుణులు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు రూ.100 ఫీజు చెల్లించి స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 8977714411 లేదా 8688848714 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.