హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్యూర్ పరిధిలో అల్పాదాయ వర్గాల (ఎల్ఐజీ) కోసం చేపట్టనున్న సరికొత్త హౌసింగ్ స్కీమ్‌కు అద్భుతమైన లోగోను సూచించిన వారికి రూ.లక్ష మనీ ఫ్రైజ్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర హౌసింగ్ బోర్డు గురువారం ప్రకటించింది.
ఈ పథకంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలనే ఆలోచనతో ఆఫర్ ఇచ్చామని హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీల్లో బెస్ట్ లోగోను డిజైన్ చేసిన వారికి స్కీమ్ ప్రారంభోత్సవం రోజే రూ.లక్ష బహుమతిని అందజేస్తామని పేర్కొన్నారు.
ఈ పథకం లక్ష్యం, ఉద్దేశం ప్రతిబింబించేలా సృజనాత్మకంగా, సరళంగా, ఆధునికతను ప్రతిబింబించేలా లోగో ఉండాలని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తమ డిజైన్ లను/ ప్రతిపాదనలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ tghd.official లో https://www.instagram.com/p/Dahnht3zFwE/ ద్వారా జులై 12లోపు సమర్పించాలని సూచించారు.
క్యూర్ ఎల్ఐజీ స్కీమ్‌కు పేరు సూచించాలని పబ్లిక్‌ను కోరగా అనూహ్య స్పందన వచ్చిందని పేర్కొన్నారు. 14 వేల మంది పేర్లు పంపగా, వాటిలో 150 పేర్లను షార్ట్ లిస్ట్ చేశామని ఎండీ తెలిపారు. ఈ స్కీమ్‌కు షార్ట్ లిస్ట్ చేసిన పేర్లను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
