తెలంగాణలో భారీగా ఐఏఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. మొత్తం 45 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఫిబ్రవరి 25న ఉత్తర్వులు జారీ చేశారు.
పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్ గా సంజయ్ కుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. విపత్తు, నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా దాన కిషోర్, దేవాదయ శాఖ డైరెక్టర్ గా ఎం. హనుమంతరావు, ప్రజావాణి నోడల్ అధికారికిగా డి. దివ్య, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ కార్యదర్శిగా ఉప్పల్ గౌరవ్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ. శ్రీధర్ లను నియమించింది ప్రభుత్వం. వీరితో పాటు పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేసింది ప్రభుత్వం.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా స్నేహ శబరీష్ ..మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా డా. శబరీష్ నియమించారు . ఒకే జిల్లా లో కలెక్టర్, ఎస్పీ గా కీలక పోస్టుల్లో భార్య, భర్తలు నియమితులయ్యారు. హనుమకొండ కలెక్టర్ గా చాహత్ బాజ్ పాయ్, యాదాద్రి భువనగిరి జిల్లా కొత్త కలెక్టర్ గా అనురాగ్ జయంతి, కరీంనగర్ జిల్లా కొత్త కలెక్టర్ గా చిత్రా మిశ్రా, వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా దీపక్ తివారి నియమించారు. ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్న దీపక్ తివారీని జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణ పేట జిల్లా కలెక్టర్ గా ప్రతీక్ జైన్ నియమించింది ప్రభుత్వం
