తెలంగాణ వచ్చాక ఇండస్ట్రీలో చాలా మార్పు : హరీష్

తెలంగాణ వచ్చాక ఇండస్ట్రీలో చాలా మార్పు : హరీష్

ఉమ్మడి ఏపీతో పోలిస్తే… తెలంగాణ వచ్చాక ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చిందన్నారు ఫైనాన్స్ మినిష్టర్ హరీష్ రావు. FTCCI నిర్వహించిన విజన్ తెలంగాణ ఇంటరాక్టీవ్ సెషన్ లో పాల్గొని మాట్లాడారు హరీష్. తెలంగాణ వచ్చాక చాలా మంది హేద్దవా చేశారని.. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రాదు… అది ఇది అని చాలా మాటలన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు భారత్ లో అన్ని రాష్ట్రాలకి తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుని విజయవంతంగా నిర్మించామని.. రైతుల కోసం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఐటీ పాస్ ఏర్పాటు చేశామని.. అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్ కి తీసుకొస్తున్నామని తెలిపారు మంత్రి. 70 ఏళ్ల స్వతంత్రoలో మన ప్రభుత్వాలు మారుమూల ప్రాంతాలకి నీళ్ళు అందించలేక పోయాయని.. చాలా జిల్లాలోని ప్రజలు ఫ్లోరైడ్ తో కొట్టుమిట్టులాడారని తెలిపారు. 90 శాతం రోగాలు నీళ్ల వల్లనే వస్తాయి. కానీ ఐదేళ్ల తెలంగాణలో పరిస్థితి మారిందన్నారు. మిషన్ భగీరథ స్కీము తీసుకొచ్చి నలుమూలల మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. దీనికంతటికీ కారణం సీఎం కేసీఆర్ పట్టుదలనే అన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రాంతంలో, మహారాష్ట్రలొనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగేవని.. ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పారు. రైతులకి 24 గంటల ఫ్రీ కరెంట్, సబ్సిడీ అందిస్తున్నాం. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామన్నారు.

రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న హరీష్… కేంద్ర ప్రభుత్వం కూడా రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిందన్నారు. మెరుగైన విద్య అందించటానికి రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేశామని.. తెలంగాణలో 542 ఇంగ్లీష్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. ఇన్ని స్కూల్స్ ఏ రాష్ట్రంలో లో లేవన్న ఆయన.. ఏడాదికి ఒక్కో విద్యార్థి మీద ఒక లక్ష రూపాయలు కర్చుపెడ్తున్నామన్నారు. హైదరాబాద్ ని గ్లోబల్ హెల్త్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని..అన్ని జిల్లాల్లో డయాలసిస్ సెంటర్ లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. వరంగల్ లో ఏర్పాటు చేయనున్న టెక్స్ట్ టైల్ పార్క్… ల్యాండ్ ఇష్యూ వల్ల డీలే అయిందని.. అతి త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు.