ఇంటర్ ఎగ్జామ్స్..  ఏప్రిల్ 20 నుంచి

ఇంటర్ ఎగ్జామ్స్..  ఏప్రిల్ 20 నుంచి
  • మే 10 వరకు కొనసాగనున్న పరీక్షలు 

ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ మొదలు కానున్నాయి. ఏప్రిల్ 20 నుంచి మే 9 వరకు ఫస్టియర్, ఏప్రిల్ 21 నుంచి మే 10 వరకు సెకండియర్ పరీక్షలు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.  ఈ నెల10 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా, మార్చి 2 వరకు రూ.2 వేల ఫైన్​తో ఇంటర్ ఎగ్జామ్​ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. మార్చి  23 నుంచి ప్రాక్టికల్స్ రివైజ్డ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన బోర్డు 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 20 నుంచి మే 9 వరకు ఫస్టియర్, ఏప్రిల్ 21 నుంచి మే 10 వరకు సెకండియర్ పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఈ మేరకు సోమవారం ఇంటర్ బోర్డు రివైజ్డ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఫస్టియర్ స్టూడెంట్లకు మెయిన్ ఎగ్జామ్స్ మే 2న, సెకండియర్ స్టూడెంట్లకు మే5న ముగుస్తాయి. మిగిలిన నాలుగు రోజులు ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు స్టూడెంట్లకు మైనర్ ఎగ్జామ్స్ కొనసాగుతాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 4 వరకు రెగ్యులర్, ఒకేషనల్ స్టూడెంట్లకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని బోర్డు వెల్లడించింది. ఆదివారం కూడా ప్రాక్టికల్స్ కొనసాగుతాయని చెప్పింది. ఏప్రిల్11, 12 తేదీల్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్​మెంటల్ ఎగ్జామ్స్​ ఉంటాయని తెలిపింది. ఈ నెల10 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా, మార్చి 2 వరకు రూ.2 వేల ఫైన్​తో ఫీజు చెల్లించేందుకు చాన్స్​ ఉంది. ఫిబ్రవరి10 నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, 23 నుంచి ప్రాక్టికల్స్​, మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయని గతంలో పేర్కొంది.