ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ లో టాప్ లేపిన మేడ్చల్.. రంగారెడ్డి రన్నరప్.. వెనకబడ్డ హైదరాబాద్, వికారాబాద్

ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ లో  టాప్ లేపిన మేడ్చల్.. రంగారెడ్డి రన్నరప్.. వెనకబడ్డ హైదరాబాద్, వికారాబాద్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ‘టాప్’ లేపింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఇతర జిల్లాలను వెనక్కి నెట్టి ఫస్టియర్​లో రాష్ట్రంలోనే ఫస్ట్​ ప్లేస్​లో నిలిచింది. రంగారెడ్డి రెండో స్థానంలో నిలవగా, హైదరాబాద్, వికారాబాద్​ జిల్లాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు. అన్ని చోట్లా అబ్బాయిల కంటే అమ్మాయిలే అత్యుత్తమ ఫలితాలు సాధించడం విశేషం.

హైదరాబాద్ సిటీ/చేవెళ్ల/ మేడ్చల్​/ వికారాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా ఈసారి ఇంటర్ రిజల్ట్స్​లో ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ చూపింది. ఫస్ట్ ఇయర్ జనరల్​లో మొత్తం మీద 79.73 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఫలితంగా  రాష్ట్రంలోనే నంబర్ వన్ ప్లేస్​లో నిలవగా, సెకండ్ ఇయర్​లో 4వ స్థానం (82.73%)లో నిలిచింది. ఫస్ట్ ఇయర్ జనరల్ చూస్తే అబ్బాయిలు 35,826 మంది ఎగ్జామ్ రాయగా 26,147 మంది పాస్ అయ్యారు. 

అమ్మాయిలు 30,045 మందిలో 24,777 మంది పాస్ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్ జనరల్​లో అబ్బాయిలు 33,926 మందికి 26,848 మంది, అమ్మాయిలు 30,220 మందికి 26,223 మంది పాస్ అయ్యారు. వొకేషనల్ విషయానికొస్తే, ఫస్ట్ ఇయర్​లో అబ్బాయిలు 756 మందికి 382 మంది, అమ్మాయిలు 738 మందిలో 576 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ వొకేషనల్​లో అబ్బాయిలు 660 మందికి 420 మంది, అమ్మాయిలు 620 మందిలో 502 మంది పాస్ అయ్యారు. మొత్తంగా అబ్బాయిల కంటే జిల్లాలో అమ్మాయిలే 5.42 శాతం ఎక్కువగా పాస్ అయ్యారు.

రంగారెడ్డి.. రన్నరప్

రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ఇయర్​లో రాష్ట్రంలో 2వ స్థానం, సెకండ్ ఇయర్​లో 5వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్ మొత్తం 80,096 మందిలో 61,177 (76.38%) మంది పాస్ అయ్యారు. ఇందులో అబ్బాయిలు 42,067 మందికి 30,266 మంది, అమ్మాయిలు 38,023 మందికి 30,911 మంది పాస్ అయ్యారు. వొకేషనల్​లో 3,946 మందికి 2,438 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ రెగ్యులర్ విషయానికొస్తే 74,723 మందిలో 60,981 (81.61%) మంది పాస్ అయ్యారు. 

ఇక్కడ అమ్మాయిలు 36,680 మందికి 31,541 మంది, అబ్బాయిలు 38,043 మందికి 29,440 మంది పాస్ అయ్యారు. ప్రైవేట్ ఎగ్జామ్స్ రాసిన వారు 7,246 మందిలో కేవలం 2,106 మందే పాస్ అయ్యారు. వొకేషనల్ రెగ్యులర్ లో 3,042 మందికి 2,279 మంది పాస్ అయ్యారు.

వికారాబాద్.. ఫ్లాప్ షో!​

వికారాబాద్ జిల్లా సెకండ్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్​లో 25వ స్థానంలో, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్​లో 31వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ మొత్తం 5,372 మందిలో 3,719 (69.23%) మంది పాస్ అయ్యారు. ఇందులో అబ్బాయిలు 2,404 మందికి 1,466  మంది, అమ్మాయిలు 2,968 మందికి 2,253 మంది పాస్ అయ్యారు. వొకేషనల్ సెకండ్ ఇయర్​లో 1,353 మందికి గాను ఏకంగా 96.05 శాతం మంది పాస్ అయ్యారు. ప్రైవేట్ ఎగ్జామ్స్ రాసిన వారు 1,177 మంది ఉంటే కేవలం 290 (24.64%) మందే పాస్ అయ్యారు. వొకేషనల్ ప్రైవేట్ ఎగ్జామ్ రాసిన వారిలో 67 మంది పాస్ అయ్యారు.

హైదరాబాద్.. అంతంతే..

హైదరాబాద్ జిల్లాలో ఫస్ట్ ఇయర్​లో మొత్తం 82,507 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే, అందులో 53,246 (64.54%) మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ జనరల్​లో అబ్బాయిలు 39,312 మందిలో 22,014  మంది పాస్ అయితే, అమ్మాయిలు 39,118 మందిలో 28,618 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్​లో జనరల్, వొకేషనల్ కలిపి మొత్తం 78,812 మంది రాస్తే 57,151 (72.51%) మంది పాస్ అయ్యారు. 

ఇందులో అబ్బాయిలు 37,729 మందికి 24,648 మంది, అమ్మాయిలు 37,317 మందికి 29,621 మంది పాస్ అయ్యారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ 98.01 శాతం (252 మందికి 247 మంది) రిజల్ట్స్‌ తో టాప్​లో ఉన్నాయి. టీఎస్‌ఆర్‌జేసీ 91.78%, ట్రైబల్ వెల్ఫేర్ 87.21%, టీఎంఆర్‌జేసీ 85.40%, రైల్వే కాలేజీలు 70.67% పాస్ పర్సంటేజీ సాధించాయి. ప్రభుత్వ కాలేజీలు మాత్రం 37.24 (6,697 మందికి 2,494 మంది) శాతానికే పరిమితమయ్యాయి.