తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల..

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల..

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసింది ప్రభుత్వం. సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన 2లక్షల 54వేల 498మంది విద్యార్థుల్లో 1లక్ష 62వేల 520మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1లక్ష 28వేల 477మంది విద్యార్థులు హాజరు కాగా 60వేల 625మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు అధికారులు.ఫస్టియర్ ఒకేషనల్ కోర్సులో 10,070 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా సెకండియర్ ఒకేషనల్ కోర్సులో 7,737 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు విద్యాశాఖ అధికారులు.