ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్

ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
  • మొత్తంగా 4 లక్షల మందికిపైగా స్టూడెంట్లు అటెండ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 2 నుంచి ప్రారంభం కాగా.. షెడ్యూల్ ప్రకారం 21 వరకు జరగాల్సిన ఉన్నా.. ఇంటర్ బోర్డు సమగ్రమైన ప్లాన్​తో ముందస్తుగానే ముగిశాయి. కాగా, స్టేట్​లో మొత్తం 4,01,265 మంది స్టూడెంట్లు ప్రాక్టికల్స్​కు హాజరైనట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రకటించారు.

జనరల్ కోర్సుల కోసం 1,440  సెంటర్లు ఏర్పాటు చేయగా.. వాటిలో 3,11,011 మంది.. ఒకేషనల్​ లో 484 సెంటర్లలో 90,254 మంది హాజరయ్యారు. తొలిసారిగా ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్, సెక్టార్ కాలేజీల్లో కలిపి 14 వేలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.