మరో రెండు రోజులు భారీ వర్షాలు

మరో రెండు రోజులు భారీ వర్షాలు

రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. అల్పపీడణ ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకో 48 గంటలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు... అత్యంత భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపారు అధికారులు. గడిచిన 24 గంటల్లో 9 సెంటీ మీటర్ల నుంచి 20 సెంటీ మీటర్ల వరకు వర్షాలు పడ్డాయని తెలిపారు అధికారులు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ ప్రాంతంలో....20 సెం.మీటర్ల అత్యంత భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా మమ్డాలో 15.3, కామారెడ్డి జిల్లా జుక్కల్ లో 12.8, నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో 12.7, జగిత్యాల జిల్లా వెల్గటూర్ 12.3 సెం.మీటర్ల వర్షం పడింది. 
భారీ వర్షాలలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లాలో పడుతున్న వానలతో SRSPలోకి  ఇన్ ఫ్లో అంతకంతా పెరుగుతోంది. ఇన్ ఫ్లో 80 వేల 544 క్యూసెక్కులుగా ఉంది. వర్షాలు ఇలాగే పడితే ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.