విద్యా వ్యవస్థలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: కవిత

విద్యా వ్యవస్థలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: కవిత
  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్​, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా విద్యా వ్యవస్థలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అయినా కేసీఆర్‌‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు. 

బాలికల విద్యకు రాష్ట్రం స్వర్ణయుగంగా మారిందన్నారు. పీజీలో 72, డిగ్రీలో 52, కేజీబీవీల్లో 69, బీఈడీలో 81 శాతం అడ్మిషన్లు అమ్మాయిలే తీసుకున్నారని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఉన్నత విద్యలోనూ అమ్మాయిల ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ రేషియోలో జాతీయ సగటును మించి ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. కేంద్ర సర్కారు మెడికల్‌‌ కాలేజీల కేటాయింపులోనూ తెలంగాణపై వివక్ష చూపించిందని,  అయినా తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున మెడికల్‌‌ కాలేజీలు ఏర్పాటు చేసి ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్‌‌ సీట్లు కల్పించిందన్నారు.