తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరైన ప్రతినిధుల కోసం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా రూపొందించిన సావనీర్ కిట్, కలినరీ కిట్‌ను అందిస్తోంది. ఈ రెండు కిట్లు తెలంగాణ కళా వారసత్వం, సాంప్రదాయ శైలులు, రుచుల వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతాయి. అసలు సావనీర్ కిట్ , కలినరీ కిట్ అంటే ఏంటి.? వాటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
సావనీర్ కిట్: తెలంగాణ కళాశైలలకు ప్రతిరూపం
తెలంగాణ ప్రఖ్యాత హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ క్లస్టర్లలో నైపుణ్యంతో తయారైన కళాఖండాలతో ఈ సావనీర్ కిట్ రూపొందించబడింది. ఈ కిట్‌లోని ప్రతి హస్తకళా వస్తువు రాష్ట్ర సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కిట్‌లో ఏమున్నాయంటే..?
- ఇకట్ స్టోల్ – పోచంపల్లి సంప్రదాయ నెయ్యదళంతో అద్భుతంగా నేసిన వస్త్రం.
- పెర్ల్ ఈయరింగ్స్ – ముత్యాల నగరమైన హైదరాబాద్ యొక్క ఘనతను సూచించే ఆభరణాలు.
- లాక్ చుడీలు – తెలంగాణ సంప్రదాయ లాక్ కళతో రూపొందించిన రంగురంగుల చుడీలు.
- హైదరాబాద్ అత్తర్ – పురాతన సుగంధ పరిమళ సంప్రదాయాన్ని గుర్తుచేసే అత్తర్.
- చేరియల్ ఫ్రిజ్ మాగ్నెట్ – ప్రసిద్ధ చేరియల్ స్క్రోల్ పెయింటింగ్ కళకు నివాళి.
కలినరీ కిట్: తెలంగాణ స్వదేశీ రుచుల పరిమళం
తెలంగాణ సంప్రదాయ ఇంటింటా ప్రేమగా తయారు చేసే అస్తిత్వవంతమైన వంటకాల సమాహారమే ఈ కలినరీ కిట్. ఇందులో ఏమున్నాయంటే.?
- సక్కినాలు
- అప్పలు
- మహువ లడ్డూ
- నువ్వుల లడ్డూ
- బదాం కి జాలి
- మక్క పెలాలు

