తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ ఫలితాలు విడుదల

తెలంగాణ జూనియర్ లెక్చరర్స్  ఫలితాలు విడుదల

తెలంగాణ జూనియర్ లెక్చరర్ల ఫలితాలు విడుదయ్యాయి. రాష్ట్రంలోని 1392 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు 2024 సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు పరీక్షలు నిర్వహించారు. సోమవారం (జూలై 8 ఈ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకుల జాబితాను  సబ్జెక్టుల వారీగా ప్రకటించారు. 

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 1:2 నిష్పత్తిలో , డీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో జాబితాను త్వరలో విడుదల  చేయనున్నారు. అభ్యర్థులు జూనియర్ లెక్చరర్ల ఫలి తాలను  టీజీపీఎస్సీ వెబ్ సైట్ http://www.tspsc.gov.in లో చెక్ చేసుకోవచ్చు. జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకారం మెరిట్ తయారు చేసినట్లు టీజీపీఎస్సీ తెలి పింది. 

ల్యాబ్ టెక్నషియన్ పోస్టుల ఫలితాలు విడుదల 

హైదరాబాద్: ల్యాబ్ టెక్నషియన్ పోస్టుల ఫలితాలను టీజీటీఎస్సీ సోమవారం (జూలై8) విడుదల చేసింది.2017లో ఈ పోస్టులకు నియామక నోటిఫికేషన్ వి డుదల చేసింది టీజీపీఎస్సీ. ల్యాబ్ టెక్నీషియన్లు టీజీపీఎస్సీ ముట్టడించనున్న క్రమంలో కమిషన్ ముందుగానే రిజల్ట్ విడుదల చేసింది ఈ ఫలితాలనుwww.tspsc.gov.in వెబ్ సైట్ లో ఉంచింది.