
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలోనే నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కవాడిగూడలోని సీజీవో టవర్స్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం తరపున అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలను గతేడాది నిర్వహించామన్నారు. ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం తరపున ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తానమి కిషన్ రెడ్డి తెలిపారు.
ఎన్నికల్లో గెలవకముందు కేసీఆర్ అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత.. అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాట తప్పారు. మజ్లిస్ పార్టీకి ఒవైసీ ఒత్తిడికి తలొగ్గి కేసీఆర్ విమోచన కార్యక్రమాలు చేయడం లేదన్నారు. ఆనాడు అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ తెలంగాణ గడ్డపైన త్రివర్ణ పతాకం ఎగరేస్తే. ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా గతేడాది జెండా ఎగరేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేండ్లు అవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవాలు జరిపామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.