తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కేవలం నాలుగు రోజుల్లో రూ. 600కోట్లు లిక్కర్ తాగారు మనోళ్లు. డిసెంబర్ 1 నుంచి 4 వరకు భారీగా అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 107 శాతం లిక్కర్ సేల్స్ పెరిగాయి. గమ్మత్తయిన విషయం ఏంటంటే.. చలికాలంలో కూడా బీర్ల అమ్మకాలు భారీగా ఉండటం.
ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ పొద్దున, రాత్రి చలి విపరీతంగా సమయంలో కూడా అత్యధికంగా బీర్లు అమ్ముడయ్యాయి. నాలుగు రోజుల్లో 5.89లక్షల కేసుల బీర్లు తాగారట .గతేడాది ఇదే సమయంలో కేవలం 4లక్షల 29కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయని ఎక్సైజ్ డిపార్టుమెంట్ లెక్కలు చెబుతున్నాయి. కొత్త మద్యం పాలసీ, ఊర్లలో సర్పంచ్ ఎన్నికల సందర్బంగా లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ అధికారులు అంటున్నారు.
ఇంతకుముందు దసరా సందర్భంగా కూడా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. దసర పండుగా, గాంధీ జయంతి రెండూ ఒకే రోజు వచ్చినప్పటికీ మద్యం అమ్మకాల జోరు తగ్గలేదు. దసరా పండుగకు రూ.419 కోట్లు మద్యం తాగేశారు మనోళ్లు.
