Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 తొలి ఫైనలిస్ట్ కళ్యాణ్.. టైటిల్ రేస్‌లో ఆర్మీ మెన్ దూకుడు!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 తొలి ఫైనలిస్ట్ కళ్యాణ్.. టైటిల్ రేస్‌లో ఆర్మీ మెన్ దూకుడు!

బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 తుది దశకు చేరుకుంది. మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది.  టైటిల్ పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో అత్యంత కీలకమైన 'టికెట్ టు ఫినాలే' (Ticket to Finale) టాస్క్‌లు జరుగుతున్నాయి. ఈ టాస్క్‌లో గెలిచిన కంటెస్టెంట్ నేరుగా సీజన్ ఫైనల్‌కు చేరుకుంటాడు. చివరి దశకు చేరకున్న ఈ షో మరింత రసవత్తరంగా సాగుతోంది. టఫ్ టాస్క్ లతో ఇంటి సభ్యులకు చెమటలు పట్టిస్తున్నారు బిగ్ బాస్. 

ఆర్మీ మెన్ దూకుడు!.. 

ఈ బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యుడిగా అడుగుపెట్టిన సైనికుడు కళ్యాణ్ పడాల సంచలనం సృష్టిస్తున్నాడు. వరుస విజయాలు, పట్టుదలతో కూడిన ఆటతీరుతో టైటిల్ రేస్‌లో దూసుకుపోతున్నాడు. చివరి దశ టాస్క్‌లలో రీతూ , ఇమ్మాన్యుయెల్ వంటి గట్టి పోటీదారులను ఓడించి మొదటి ఫైనలిస్ట్‌గా అవతరించి చరిత్ర సృష్టించాడు  కళ్యాణ్. కళ్యాణ్ పడాల ఈ సీజన్‌లో తన గ్రాఫ్‌ను అద్భుతంగా పెంచుకున్నాడు. ఒక సామాన్యుడిగా వచ్చి, ప్రతి వారం నామినేషన్లలోకి వచ్చినా ఓటింగ్ బలం నిరూపించుకుంటూ టాప్‌లో నిలిచాడు. ఇటు టాస్క్‌లలోనూ పూర్తి ఎనర్జీతో, సైనికుడి దూకుడుతో పోరాడుతున్నాడు.

కెప్టెన్‌గా, ఫైనలిస్ట్‌గా రికార్డు

'టికెట్ టు ఫినాలే' టాస్క్‌ల కంటే ముందు, హౌస్‌లో జరిగిన చివరి కెప్టెన్సీ రేస్ లో కూడా కళ్యాణ్ తన సత్తా చాటాడు. డెమాన్ పవన్‌తో హోరాహోరీగా పోరాడి, సీజన్ 9కి చివరి కెప్టెన్‌గా విజయం సాధించాడు. డబుల్ ధమాకాగా, కెప్టెన్ అయిన కొద్ది రోజులకే 'టికెట్ టు ఫినాలే' రేసులోనూ విజయం సాధించి, నేరుగా టాప్ 5 లోకి అడుగుపెట్టాడు. 'టికెట్ టు ఫినాలే' చివరి పోరులో తనూజ సహకారంతో కళ్యాణ్ పడాల విజయాన్ని సాధించాడు. ముఖ్యంగా, బలమైన పోటీదారుడు, పవర్ ప్లేయర్ అయిన ఇమ్మాన్యుయేల్ ను ఓడించి ఈ ఘనత సాధించడం విశేషం.

 టైటిల్ ట్రోఫీకి మరింత చేరువలో..

చివరి వారాల్లో ఇంత దూకుడు చూపించడం అంటే, అది కేవలం ఫైనలిస్ట్‌గా నిలవడమే కాదు, టైటిల్ ట్రోఫీకి మరింత చేరువైనట్టే అంటున్నారు అభిమానులు, నెటిజన్లు. చివరి కెప్టెన్సీ, ఫస్ట్ ఫైనలిస్ట్... ఈ వరుస విజయాలు హౌస్‌లో కళ్యాణ్ ఆధిపత్యాన్ని, అతని స్టామినాను స్పష్టంగా చూపిస్తున్నాయి. సామాన్యుడిగా హౌస్‌లోకి వెళ్లిన ఒక తెలుగు కుర్రాడు ఇంత దూరం వచ్చి, టైటిల్ రేస్‌లో లీడ్‌లో ఉండటం ప్రేక్షకుల్లో సానుభూతిని, అభిమానాన్ని మరింత పెంచుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేవలం ఎనర్జీ మాత్రమే కాకుండా, పరిస్థితులకు తగ్గట్టుగా స్ట్రాటజీలను మార్చుకుంటూ, సరైన సమయంలో సరైన అడుగులు వేయడం కళ్యాణ్ విజయాన్ని సులభతరం చేస్తోందంటున్నారు నెటిజన్లు.

►ALSO READ | Prabhas: 'కల్కి 2'కి గ్లోబల్ టచ్.. దీపికా స్థానంలో ప్రియాంక చోప్రా ఎంట్రీ? ఫ్యాన్స్ డిమాండ్!

ఇప్పటికే విన్నర్ ట్రోఫీకి చాలా దగ్గరైన కళ్యాణ్ పడాల, ఈ సీజన్ కప్ కొట్టినా కొట్టొచ్చనే మాట సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ఫస్ట్ ఫైనలిస్ట్ అనే ఘనతతో ప్రేక్షకులలో అతనిపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. మరి కళ్యాణ్ అదృష్టం, ఆటతీరు, స్ట్రాటజీలు అతన్ని బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్‌గా నిలబెడుతుందో లేదో చూడాలి...