RashmikaVijay: ఫిబ్రవరిలో విజయ్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నేషనల్ క్రష్!

RashmikaVijay: ఫిబ్రవరిలో విజయ్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నేషనల్ క్రష్!

 నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వివాహం గురించి గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్‌ టాపిక్‌గా మారింది. వచ్చే ఫిబ్రవరిలో ఈ ప్రేమజంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే దీనిపై లేటెస్ట్ గా రష్మిక  ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. విజయ్ తో పెళ్లిపై ఈ బ్యూటీ స్పందించిన తీరు అభిమానుల్లో మరింత ఉత్సుకత పెంచింది.

పెళ్లిపై రష్మిక క్లారిటీ.. 

రష్మిక తన పెళ్లి వార్తలపై నేరుగా స్పందించడానికి ఇష్టపడలేదు. నేను ఈ వార్తలను ఇప్పుడే ధృవీకరించలేను. అలాగని ఖండించనూ లేను. పెళ్లి గురించి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో.. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరితో పంచుకుంటాను అని చెప్పింది.. అంతకు మించి వివరాలు ఇప్పుడే ఏమీ చెప్పలేను అని స్పష్టం చేసింది.. ఈ వ్యాఖ్యలు పెళ్లి రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టకపోగా.. త్వరలోనే శుభవార్త వినే అవకాశం ఉందంటూ నెటిజన్లలో కొత్త చర్చకు దారితీశాయి. గతంలో 'ది గర్ల్‌ఫ్రెండ్' ప్రమోషన్స్‌లో విజయ్ కూడా రష్మిక పట్ల ప్రేమను వ్యక్తం చేయడం.. వారిద్దరూ కలిసి సీక్రెట్ హాలిడేలకు వెళ్లిన ఫొటోలు వైరల్ కావడం వంటి పరిణామాలు ఈ రూమర్‌లకు మరింత బలం చేకూర్చాయి.

వ్యక్తిగత జీవితంపై పక్కా ప్రణాళిక

రష్మిక తన వ్యక్తిగత జీవితాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటారో ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నేను పర్సనల్ లైఫ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటా. వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడించడానికి ఇష్టపడను. ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ గురించి మాట్లాడను, అదేవిధంగా బయటికి వచ్చినప్పుడు పర్సనల్ విషయాలు చర్చించను. ప్రతి పనికి ఒక ప్రణాళిక వేసుకుంటా అని తెలిపారు. సినిమాల విషయానికొస్తే, కొన్నిసార్లు అనుకున్నట్లు జరగదని, తాను డబుల్ షిఫ్ట్‌లు చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయని చెప్పారు.

►ALSO READ | Balakrishna: అఖండ 2' ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఇండియాలో ప్రీమియర్ షోలు రద్దు.. తీవ్ర నిరాశలో అభిమానులు

 ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకం!

ఈ ఏడాది తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనదని రష్మిక ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలో నా ఐదు సినిమాలు రిలీజై మంచి విజయాన్ని సాధించాయి. భాష, జానర్ అనే హద్దులు లేకుండా విభిన్న పాత్రలు చేయాలని మొదటి నుంచి అనుకున్నా. ప్రేక్షకులు ఆ పాత్రలను స్వీకరించి, ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది అని చెప్పారు.

మొత్తంగా, విజయ్ దేవరకొండతో తన పెళ్లి గురించి గోప్యత పాటిస్తున్నప్పటికీ..  సరైన వేదిక, సమయంలో తప్పకుండా ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని రష్మిక క్లారిటీ ఇచ్చింది.  నేషనల్ క్రష్ నోటి నుంచి ఆ పెళ్లి కబురు ఎప్పుడు వినబడుతుందోనని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.