Balakrishna: అఖండ 2' ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఇండియాలో ప్రీమియర్ షోలు రద్దు.. తీవ్ర నిరాశలో అభిమానులు

Balakrishna: అఖండ 2' ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఇండియాలో ప్రీమియర్ షోలు రద్దు.. తీవ్ర నిరాశలో అభిమానులు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ 2: తాండవం'.   డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కానీ ఈ మూవీ విడుదల ఆరంభంలోనే అభిమానులకు నిరాశ కలిగింది. ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోలను సాంకేతిక కారణాల వల్ల రద్దు చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. 

 చివరి నిమిషంలో బిగ్ షాక్!

బాలయ్య అభిమానులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో  ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం టికెట్ల పెంపుతో సహా ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. రాత్రి 8 గంటల నుంచి షోలు మొదలవుతాయని ప్రకటన వచ్చింది. చివరి నిమిషం వరకు టికెట్ బుకింగ్స్‌పై సరైన సమాచారం లేక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. సరిగ్గా ప్రీమియర్స్ వేయాల్సిన సమయానికి కాసేపటి ముందు, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇవాళ రాత్రి జరగాల్సిన ప్రీమియర్ల షోలను రద్దు చేస్తున్నాం. షెడ్యూల్ ప్రకారం షోలు వేసేందుకు మేము చాలా ప్రయత్నించాం, కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. అసౌకర్యానికి క్షమించండి.. అంటూ 14 రీల్స్ ప్లస్ సంస్థ ట్వీట్ చేసింది.

►ALSO READ | Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్ హౌస్‌లో 'ఫస్ట్ ఫైనలిస్ట్' రేస్ క్లైమాక్స్.. టాప్ 5 లెక్కలు గల్లంతు చేసిన రీతూ చౌదరి!

అయితే, ఓవర్సీస్‌లో  మాత్రం ప్రీమియర్స్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేయడంతో, ఇండియాలోని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకవైపు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియర్‌కు రూ. 600 ధరతో అనుమతి ఇచ్చింది. అదనపు షోలకు కూడా వెసులుబాటు కల్పించగా, చివరి నిమిషంలో ఈ రద్దు జరగడం కలకలం రేపింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశతో థియేటర్ల నుంచి వెనుదిరుగుతున్నారు.