మెల్బోర్న్: యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో చెలరేగాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విజృంభిస్తోన్న ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని శతకం పూర్తి చేసుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో రూట్‌కు ఇదే తొలి సెంచరీ.
క్రికెట్లో ఎన్నో రికార్డులు సాధించిన రూట్‌కు యాషెస్‌లో సెంచరీ మాత్రం ఇన్నాళ్లు అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ నేపథ్యంలో తాజా యాషెస్ సిరీస్‌లో రూట్ కచ్చితంగా సెంచరీ చేస్తాడని.. ఒకవేళ రూట్ శతకం సాధించకపోతే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నగ్నంగా పరిగెడతానని ఆసీస్ క్రికెట్ దిగ్గజం మాథ్యూ హెడెన్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
►ALSO READ | ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఒక్క ప్లేస్ ఎగబాకి నాలుగో ర్యాంక్లో విరాట్
ఈ క్రమంలో గబ్బా వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో రూట్ ఎట్టకేలకు యాషెస్ సిరీస్‌లో తన తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రూట్ శతకొట్టడంతో మాథ్యూ హెడెన్‌కు మెల్బోర్న్ గ్రౌండ్లో నగ్నంగా పరిగెత్తే పరిస్థితి తప్పింది. ఈ క్రమంలో రూట్ సెంచరీపై మాథ్యూ హెడెన్ కూతురు, క్రికెట్ ప్రెజెంటర్ గ్రేస్ హేడెన్ ఫన్నీగా స్పందించింది.
‘‘థాంక్యూ రూట్.. నువ్వు మా అందరి కళ్ళను కాపాడావు’’ అంటూ.. పరోక్షంగా తన తండ్రి నగ్న ప్రదర్శనను చూడకుండా మా కళ్లను కాపాడావు అనే అర్థం వచ్చేలా ఇన్స్‌స్టా గ్రామ్ వేదిక పోస్ట్ పెట్టింది. గ్రేస్ హేడెన్ పోస్ట్‌పై నెటిజన్లు కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. గ్రేస్ హేడెన్ చెప్పింది 100 పర్సెంట్ కరెక్ట్.. ఈ ఏజ్‌లో మాథ్యూ హెడెన్ నగ్న ప్రదర్శన చూడటామంటే పెద్ద సాహసమే అని కామెంట్స్ చేస్తున్నారు.
