ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ లో ఒక్క ప్లేస్ ఎగబాకి నాలుగో ర్యాంక్లో విరాట్‌

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ లో ఒక్క ప్లేస్ ఎగబాకి నాలుగో ర్యాంక్లో విరాట్‌

దుబాయ్‌‌‌‌: టీమిండియా స్టార్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌ను మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో కోహ్లీ (751) ఒక్క ప్లేస్‌‌‌‌ ఎగబాకి నాలుగో ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేయడం కోహ్లీ ర్యాంక్‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. మాజీ కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ (783) టాప్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లోనే కొనసాగుతున్నాడు. డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ (766), ఇబ్రహీం జద్రాన్‌‌‌‌ (764) రెండు, మూడో ర్యాంక్‌‌‌‌ల్లో ఉండగా, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (738) ఒక్క ప్లేస్‌‌‌‌ దిగజారి ఐదో ర్యాంక్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు.

గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (693) తొమ్మిదో ర్యాంక్‌‌‌‌లోనే ఉన్నాడు. బౌలింగ్‌‌‌‌లో కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (641) ఒక్క స్థానం ఎగబాకి ఆరో ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు. ప్రొటీస్‌‌‌‌తో జరిగిన తొలి వన్డేలో నాలుగు వికెట్లు తీయడం కుల్దీప్‌‌‌‌కు కలిసొచ్చింది. టెస్ట్‌‌‌‌ల్లో యశస్వి జైస్వాల్‌‌‌‌ (750), శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (730) వరుసగా 9, 12వ ర్యాంక్‌‌‌‌ల్లో ఉన్నారు. రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ 14వ ర్యాంక్‌‌‌‌కు పడిపోయాడు. బౌలర్లలో బుమ్రా (879) టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో కొనసాగుతున్నాడు. సిరాజ్‌‌‌‌ (707), కుల్దీప్‌‌‌‌ (694) 13, 15వ ర్యాంక్‌‌‌‌కు పడిపోయారు.