రంగారెడ్డి ల్యాండ్ రికార్డుల ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు.. అక్రమాస్తుల కేసు నమోదు

రంగారెడ్డి ల్యాండ్ రికార్డుల ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు.. అక్రమాస్తుల కేసు నమోదు

ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. గురువారం(డిసెంబర్ 4)  రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్  అసిస్టెంట్ డైరెక్టర్ కోతం శ్రీనివాసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శ్రీనివాసులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా శ్రీనివాస్​ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. శ్రీనివాసులుపై  అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. 

రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా శ్రీనివాస్​ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లోని రాయదుర్గం, మై హోం భుజ అపార్టుమెంటులో ని శ్రీనివాసులు నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీ ఎత్తున అక్రమాస్తులను గుర్తించారు. ఆయన ఇళ్లతో పాటు కలెక్టరేట్​లో సైతం సోదాలు చేపట్టారు. శ్రీనివాసులు ఇంటితోపాటు ఆయన బంధువులు, మిత్రులఇళ్లపై సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి. 

సోదాల్లో అక్రమ ఆస్తులు:

  • మై హోం భుజాలో ఫ్లాట్ నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ / రైస్ మిల్ 
  • కర్ణాటకలో 11 ఎకరాల స్తిరాస్తికి సంబందించిన డాక్యుమెంట్లు 
  •  అనంతపూర్‌లో 11 ఎకరాల స్థిరాస్తి డాక్యుమెంట్లు 
  • మహబూబ్ నగర్‌లో 4 ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు 
  •  నారాయణపేటలో మరో 3 ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు 
  • 5 లక్షల నగదు
  • 1.6 కిలోల బంగారం
  •  770 గ్రాముల వెండి ఆభరణాలు

కియా సెల్టోస్ హైక్రాస్,  ఇన్నోవా కార్లను స్వాధీనం చేసుకున్నారు.  డాక్యుమెంట్లలో చూపిన విలువ కంటే మార్కెట్ విలువ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం  ఉండొచ్చిన  ACB అంచనా వేసింది.  కేసు దర్యాప్తు కొనసాగుతోంది.