ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్.. DGCA ఆదేశాల నిలిపివేత.. హై లెవెల్ కమిటీతో విచారణకు ఆదేశం

ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్..  DGCA ఆదేశాల నిలిపివేత.. హై లెవెల్ కమిటీతో విచారణకు ఆదేశం

ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంక్షోభానికి సంబంధించి తక్షణ చర్యలకు ఉపక్రమించింది కేంద్ర పౌర విమానయాన శాఖ. విమాన రాకపోకలకు అంతరాయం లేకుండా, విమాన సర్వీసులలో ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కార మార్గాలను ప్రారంభించింది. ఇందుకోసం శుక్రవారం (డిసెంబర్ 05) రెండు ప్రత్యేక ఉత్తర్వులను ఇచ్చింది.

శుక్రవారం రోజు అర్ధరాత్రి వరకు అన్ని విమానాల షెడ్యూలు క్రమద్ధీకరించాలని, సాధారణ స్థితికి చేరుకోవాలని ఆదేశించింది. రానున్న రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో అన్ని సర్వీసులు పునరుద్ధరణ, స్థిరీకరణ జరగాలని ఆదేశించింది. ఇండిగో ఏర్పాటు చేసే ప్రత్యేక ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా ప్రయాణికులు ఇంటి నుంచి సమాచారాన్ని తెలుసుకోవచ్చు అని వెల్లడించారు. 

FDTL నిబంధనలను DGCA సవరించడం సరికాదని చెప్పిన కేంద్రం.. DGCA ఇచ్చిన ఆదేశాలను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని.. రద్దైన ఫ్లైట్లకు పూర్తి రీఫండ్ చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రయాణికులకు వసతి ఏర్పాటు కూడా చేయాల్సిందిగా సూచించింది. 

 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు:

ఇండిగో విమాన సర్వీసు రద్దయిన క్రమంలో ఆటోమెటిగ్గా మొత్తం టికెట్ల ఫీజును తిరిగి చెల్లించాలని కేంద్ర విమానయాన సంస్థ ఆదేశించింది. విమానాశ్రయాల్లో ప్రయాణికులు నిలిచిపోతే వారికి విమానాయన సంస్థలే హోటల్స్ లో ఎకామిడేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వయసు మీద పడిన సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విమానాయన సంస్థలకు ఆదేశించింది ప్రభుత్వం

►ALSO READ | ఇండియా,రష్యా బంధం మరింత బలోపేతం..రష్యన్ పౌరులకు 30 రోజుల ఫ్రీ వీసా: ప్రధానిమోదీ

విమాన సర్వీసులు ఆలస్యం అవుతే ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. వీటిని పర్యవేక్షించేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది కేంద్రం.సంక్షోభ నివారణకు ఇప్పటికే ప్రకటించిన చర్యలతో పాటు ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తుకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం. విమానాల రాకపోకలకు అంతరాయాలు తలెత్తిన సమస్యలపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది.

ఇండిగోలో సంక్షోభానికి కారణాలేంటి..? ఎక్కడ తప్పు జరిగిందనే దానిపై విచారణ జరపనుందిఉన్నత స్థాయి కమిటీ. విచారణ అనంతరం అవసరమైన తగు చర్యలను సూచించనుంది ఉన్నత స్థాయి కమిటీ . భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు తలెత్తకుండా తీసుకోవలసిన చర్యలను సిఫార్సు చేయనుంది. పైలెట్ల పనిగంటలు, వారంలో తప్పనిసరి రెండు రోజులు సెలవుల నిబంధన ను ఇప్పటికే తాత్కాలికంగా పక్కన పెట్టింది కేంద్ర ప్రభుత్వం.