ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఏవీ కాలేజీలో వచ్చే ఫిబ్రవరి 7, 8 తేదీల్లో తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందచారి తెలిపారు. శుక్రవారం బుక్ఫెయిర్లో సాహితీ లిటరరీ ఫెస్ట్ 2026 పోస్టర్ ను ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రకృతి కవి జయరాజ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవి యాకూబ్, కార్యదర్శి ఆర్.వాసు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతలు మోర్సీమార్గరెట్, తగుళ్ల గోపాల్, తెలంగాణ సాహితి నాయకులు పాల్గొన్నారు. అనంతరం పుస్తక స్ఫూర్తి, పుస్తకం ఒక దారి దీపం చర్చా గోష్టి నిర్వహించారు.
