తెలంగాణలో 47 కరోనా కేసులు.. హైదరాబాద్‌‌లో 36

తెలంగాణలో 47 కరోనా  కేసులు.. హైదరాబాద్‌‌లో 36

దేశంలో స్వల్ప హెచ్చుతగ్గుదలతో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారంతో పోలిస్తే.. కేసుల సంఖ్య పెరిగాయి. మరోసారి రెండువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 364 మందికి వైరస్ సోకినట్లు తేలింది. నిన్న మరో 2 వేల 582 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. దీంతో రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. అలాంటి పరిస్థితే నెలకొంది. ఓ రోజు కేసుల సంఖ్య అధిమవుతే..మరోరోజు.. తక్కువగా నమోదవుతున్నాయి. కానీ.. 50లోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 47 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 34 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7, 88, 250 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి  ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.43 శాతంగా ఉందని, మొత్తం 12 వేల 458 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది. 

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : 
ఆదిలాబాద్ 00, భద్రాద్రి కొత్తగూడెం 00, హైదరాబాద్ 36, జగిత్యాల 00, నగాం 00, జయశంకర్ భూపాలపల్లి 00, జోగులాంబ గద్వాల 00, కామారెడ్డి 00, కరీంనగర్ 01, ఖమ్మం 00, కొమరంభీం ఆసిఫాబాద్ 00, మహబూబ్ నగర్ 00, మహబూబాబాద్ 00, మంచిర్యాల 00, మెదక్ 00, మేడ్చల్ మల్కాజ్ గిరి 00, ములుగు 00, నాగర్ కర్నూలు 00, నల్గొండ 00, నారాయణపేట 01, నిర్మల్ 00, నిజామాబాద్ 00, పెద్దపల్లి 00, రాజన్న సిరిసిల్ల 00, రంగారెడ్డి 07, సంగారెడ్డి 01, సిద్ధిపేట 00, సూర్యాపేట 01, వికారాబాద్ 00, వనపర్తి 00, వరంగల్ రూరల్ 00, హన్మకొండ 00, యాదాద్రి భువనగరి 00. మొత్తం - 47

మరిన్ని వార్తల కోసం : -

ఆరె కులాన్ని ఓబీసీలో చేర్చండి..

తూకంలో మోసం: వ్యాపారిని బంధించిన రైతులు