మీడియా అకాడమీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం పొడిగింపు

మీడియా అకాడమీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం పొడిగింపు
  • మరో రెండేండ్లు పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయనను మరో రెండేండ్ల పాటు ఇదే పదవిలో కొనసాగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఐ అండ్ పీఆర్ స్పెషల్ సెక్రటరీ ప్రియాంక జీవో రిలీజ్ చేశారు. ఆయన పదవీ కాలం ఈ నెల 25తో ముగియడంతో.. మరోసారి పొడిగించింది.