మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీచ్‌‌‌‌‌‌‌‌ వాలీబాల్‌‌‌‌‌‌‌‌ జట్టుకు గోల్డ్‌‌‌‌‌‌‌‌

మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీచ్‌‌‌‌‌‌‌‌ వాలీబాల్‌‌‌‌‌‌‌‌ జట్టుకు గోల్డ్‌‌‌‌‌‌‌‌

కనోయింగ్‌‌‌‌‌‌‌‌లో రెండు  కాంస్యాలు

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌: నేషనల్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో తెలంగాణకు మరో గోల్డ్‌‌‌‌ సహా మూడు మెడల్స్‌‌‌‌ లభించాయి. మెన్స్‌‌‌‌ బీచ్‌‌‌‌ వాలీబాల్‌‌‌‌ టీమ్‌‌‌‌ స్వర్ణం కైవసం చేసుకోగా... కనోయింగ్‌‌‌‌లో  అమిత్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్‌‌‌‌, అభయ్‌‌‌‌– ప్రదీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ కాంస్య పతకాలు నెగ్గారు. బీచ్‌‌‌‌ వాలీబాల్‌‌‌‌లో కృష్ణ చైతన్య, మహేశ్‌‌‌‌ తో కూడిన తెలంగాణ మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఆదివారం హోరాహోరీగా సాగిన  ఫైనల్లో 2–1 (22–24,  23–21, 15–11)తో ఆంధ్రప్రదేశ్‌‌‌‌ (నరేశ్‌‌‌‌–కృష్ణంరాజు) పై ఉత్కంఠ విజయం సాధించింది.

విమెన్స్‌‌‌‌ కేటగిరీ బ్రాంజ్​ మెడల్​ ప్లే ఆఫ్​ మ్యాచ్​లో తెలంగాణ (శ్రీకృతి–ఐశ్వర్య) 0–2తో ఒడిశా చేతిలో ఓడిపోయింది. కనోయింగ్‌‌‌‌ సీ1 మెన్స్‌‌‌‌ 1000 మీటర్ల  స్ప్రింట్‌‌‌‌లో అమిత్‌‌‌‌ కుమార్ 4 నిమిషాల 31. 53 సెకండ్ల టైమింగ్‌‌‌‌తో మూడో స్థానంతో బ్రాంజ్‌‌‌‌ నెగ్గాడు.   1000 మీటర్ల సీ2 స్ప్రింట్‌‌‌‌లో అభయ్‌‌‌‌–ప్రదీప్ కుమార్ జోడీ 4 నిమిషాల 11.55  సెకండ్లతో రాష్ట్రానికి మరో కాంస్యం అందించారు. పతకాల పట్టికలో తెలంగాణ 8 గోల్డ్‌‌‌‌ , 7 సిల్వర్‌‌‌‌, 7 బ్రాంజ్‌‌‌‌ సహా 22 మెడల్స్‌‌‌‌తో 14వ స్థానంలో నిలిచింది.