చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం: హరీశ్ రావు

 చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం: హరీశ్ రావు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై  తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. ఈ వయస్సులో  ఆయనను అరెస్ట్ చేయడం మంచిది కాదన్నారు.  

చంద్రబాబు తెలంగాణ సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారన్నారు హరీశ్ రావు. ఆనాడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే ..తెలంగాణలో పదెకరాలు వచ్చేదని.. కానీ ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్మితే  వంద ఎకరాలు వస్తదని చంద్రబాబు మెచ్చుకున్నారని తెలిపారు. కేసీఆర్  పాలన మంచిగుంది కాబట్టే చంద్రబాబు అలా మెచ్చుకున్నారన్నారు.  కేసీఆర్ లేకుంటే కాళేశ్వరం లేదన్నారు. కేసీఆర్ తెలంగాణలో రైతుల ఆదాయాన్ని పెంచారని తెలిపారు.

Also Read :- అక్టోబర్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే

 చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. వారికి మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూా మద్దతు తెలిపారు.మంత్రి మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,  ఎమ్మెల్యే షకీల్ చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు.  తెలంగాణలో ఐటీ ఉద్యోగులు, సెటిలర్ల ఓట్లను ఆకట్టుకునేందుకే హరీశ్ రావు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించినట్లుగా ఉంది.