కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌కు హరీశ్ రావు లేఖ

కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌కు హరీశ్ రావు లేఖ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు లేఖ రాశారు తెలంగాణ మత్రి హరీశ్ రావు. రెండేళ్ల బకాయిలు రూ. 900 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిధుల విడుదలతో పాటు గ్రాంట్‌ను 2021-22 తర్వాత ఐదేళ్ల పాటు పొడిగించాలని కోరారు. నీతి ఆయోగ్ సూచనతో రూ.24205 కోట్లు విడుదల చేయాలన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుతో స్థానిక సంస్థలకు రూ.81761 కోట్లు ఇవ్వాలన్నారు మంత్రి.  స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.502.29 కోట్లు) ఇవ్వాల‌న్నారు. 

14వ ఆర్థిక సంఘం సిఫార‌సుల‌ను కేంద్రం అకారణంగా తిరస్కరించిందని, రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్ధిష్ట కారణం లేకుండా గ్రాంట్లను తిరస్కరించారన్న  మంత్రి వీలైనంత త్వరగా వాటిని విడుదల చేయాలని కేంద్రమంత్రిని లేఖలో కోరారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో కేంద్రం వాటాను పొర‌బాటున తెలంగాణ‌కు కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని, దీంతో తెలంగాణ‌కు రావాల్సిన రూ.495.20 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయన్నారు. ఈ మొత్తాన్ని తెలంగాణకు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి:

ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్

యూనిస్ తుఫాను బీభత్సం